AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్‌కు బిగ్ షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. భారతి సిమెంట్ కార్పొరేషన్‌కు గతంలో ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం.కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.