AP:
వైసీపీ అధినేత జగన్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే
వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేస్తుండగా.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జగన్‌ను విభేదించి ఎమ్మెల్యేలను సభకు తీసుకురావాలని కూటమి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే మత్స్య లింగంతో పాటు ఐదుగురిని సభకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.