AP: నెల్లూరులో ఆదివారం టీడీపీకి భారీ షాక్ తగిలింది. 52వ డివిజన్ పరిధిలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు.