AP: కడప కోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. అప్పు చెల్లించడంలో విఫలమైన కారణంగా.. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఎమ్మెల్యేకే కాకుండా ఆయన కుమారుడు కొండారెడ్డికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ.. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి అప్పు తీసుకుని చెల్లించలేదు.