పొగాకు రైతులకు షాక్.. తగ్గిన ధర

12చూసినవారు
పొగాకు రైతులకు షాక్.. తగ్గిన ధర
AP: పొగాకు రైతులకు ఆరంభంలోనే షాక్ తగిలింది. గతేడాదితో పోలిస్తే ప్రారంభ ధర కిలోకు రూ.25 చొప్పున తగ్గించారు. 2025 మార్చిలో ఉత్తరాది నల్ల నేలల్లో కిలో రూ.290 చొప్పున వేలం ప్రారంభించారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో ఈ ఏడాది కిలోకు కనీసం రూ.320 ఇస్తారని రైతులు ఆశించారు. కానీ బోర్డు మాత్రం ప్రారంభ ధరగా రూ.265 మాత్రమే నిర్ణయించింది. రైతు నుంచి కొనుగోలు ధర సగటున రూ.255-260 వరకు ఉంది. పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం పెరగడం వల్లే ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్