AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం మండలంలోని 13 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సహా పలువురు నేతలు
వైసీపీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు, మండల
వైసీపీ అధ్యక్షుడు కోట్ల వెంకటరావు, మాజీ సర్పంచి బూర్లె నరేష్ తదితరులు తమ రాజీనామాలను ప్రకటించారు. మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు మద్దతు ప్రకటించిన వారు.. త్వరలో టీడీపీలో చేరి ఆయన వెంట నడుస్తామని తెలిపారు.