AP: రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తెచ్చింది. అయితే చాలా మంది ఇంకా రేషన్ కార్డులు తీసుకోలేదు. డీలర్ల వద్దే రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ-కేవైసీపీ పూర్తి చేయించుకోని వారి కార్డులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే అనర్హులుగా పరిగణించి, కార్డులను రద్దు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.