AP: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది. మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి రూ. 75 వేలు ఇచ్చినట్లు దోక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.