AP: వైసీపీకి త్వరలో బిగ్ షాక్ తగలనుంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి గెలిచారు. ఆయన ఇలా గెలిచారో లేదో అలా మంత్రి పదవిని ఇచ్చి చంద్రబాబు ఆదరించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో వ్యాపారాల కోసం ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఇప్పటివరకు ఎలాంటి పదవులు దక్కలేదు. దీంతో ఆయన మళ్ళీ టీడీపీ గూటికి వెళ్లనున్నట్లు సమాచారం. అదే జరిగితే జగన్ కు భారీ షాక్ తగిలినట్లే.