AP: పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇటీవల వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే.