వైసీపీకి షాక్... జనసేనలో భారీగా చేరికలు

85చూసినవారు
వైసీపీకి షాక్... జనసేనలో భారీగా చేరికలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పెదసింగ్ శ్రీను నేతృత్వంలో సుమారు వంద మంది కార్యకర్తలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేనలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్