AP: నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఈ చేరిక పార్టీ బలోపేతం దిశగా కీలకమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.