AP: యూట్యూబర్ నందు, మధుకర్ దంపతుల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్‌లు ఇవ్వడం నందు దంపతులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారని, యూకేలో
వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణలున్నాయి. నేరం రుజువైతే నందు, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలున్నాయి.