టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

13చూసినవారు
అమెరికాలోని టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభమైన ఈ కాల్పులు ఒక వెటర్నరీ హాస్పిటల్ సమీపానికి విస్తరించాయి. సుమారు 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. గాయపడిన వారిలో నలుగురు ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స పొందుతుండగా, మిగతా ఐదుగురు స్థిరమైన పరిస్థితిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్