ఏపీలో సర్టిఫికెట్ పేపర్ల కొరత... లక్షలాది మందికి సమస్య

11380చూసినవారు
ఏపీలో సర్టిఫికెట్ పేపర్ల కొరత... లక్షలాది మందికి సమస్య
AP: రాష్ట్రంలో స్వర్ణగ్రామ, వార్డుల ద్వారా సర్టిఫికెట్ల జారీలో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చి, కొత్త పేర్లతో సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాత సర్టిఫికెట్లను కూడా మార్చాలని సూచించింది. అయితే, మీసేవ, సచివాలయాలకు కేవలం 10 లక్షల వరకు మాత్రమే పత్రాలు అందించడంతో అవి సరిపోవడం లేదు. దీనివల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు, రైతుల అడంగల్ పత్రాల జారీకి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

సంబంధిత పోస్ట్