AP: గత కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వం వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత కేసులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తిరగదోడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు, అధికారులపై ఒత్తిడి, పలు సివిల్ వివాదాలకు సంబంధించి ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన అనుచరులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.