మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏప్రిల్ 24, 2026న హైదరాబాద్, తిరుపతిలోని ఆయన సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు అందడం, సన్నిహితుల అరెస్ట్‌లతో విజయసాయిరెడ్డి అరెస్ట్ తప్పదా? అన్న చర్చ జోరందుకుంది. కాగా, ఇటీవల VSR సీఎం చంద్రబాబుపై తీవ్రా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.