AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలికపూడి ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్నితో గొడవలకు దిగారు. వీరిద్దరి వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ వ్యవహారంపై సీఎం సీరియస్‌గా ఉన్నారు. దాంతో ఆయనపై వేటు వేస్తారనే చర్చ జరుగుతోంది.