యూపీలో చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు

6217చూసినవారు
యూపీలో చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు
యూపీలోని మహోబా జిల్లాలో 18 నెలల క్రితం మరణించిన అంగన్‌వాడీ కార్యకర్త పార్వతికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆమె విధులకు గైర్హాజరవుతోందని, వెంటనే విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఆమె భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఇక ఆమె పేరు మీద గౌరవ వేతనం ఎవరి ఖాతాలోకి వెళ్తోందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పార్వతి కుమారుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధిత పోస్ట్