భారత జట్టు జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సిరీస్ జూలై 23 నుండి 26 వరకు హరారేలో జరుగుతుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో రాణించిన యువ క్రికెటర్లను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి సీనియర్ జట్టులో చోటు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, గాయంతో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.