శ్రీ విష్ణు నటించిన క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఏప్రిల్ 3 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించారు. కాల భైరవ సంగీతం అందించారు. థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.