రొయ్యల మేత ధరలు భారీగా పెంపు

68చూసినవారు
రొయ్యల మేత ధరలు భారీగా పెంపు
AP: ఏలూరు జిల్లాలో రొయ్యల మేత ధరలు భారీగా పెరిగాయి. రైతుల ఆమోదం, ప్రభుత్వ అనుమతి లేకుండానే తయారీ సంస్థలు ధరలను పెంచినట్లు ఆక్వా రైతు సంఘం ఆరోపించింది. వెనామీ మేతపై కిలోకు రూ.9, టైగర్ మేతపై కిలోకు రూ.12 చొప్పున పెంచగా.. పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే మేత ధరలు పెంచినట్లు ఫీడ్‌ కంపెనీలు చెబుతున్నాయి. కాగా, ధరల పెంపుపై ఆక్వా రైతు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్