దుల్కర్ సల్మాన్ సినిమాలో శృతి హాసన్ పవర్ఫుల్ పాత్ర!

11273చూసినవారు
దుల్కర్ సల్మాన్ సినిమాలో శృతి హాసన్ పవర్ఫుల్ పాత్ర!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫీల్-గుడ్ ఎంటర్టైనర్ 'ఆకాశంలో ఒక తార'. యువ దర్శకుడు పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతోంది. శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి, ఆమె ఒక బోల్డ్, ప్రోత్సాహకరమైన 'సైన్స్ టీచర్' పాత్రలో కనిపించబోతోందని ధృవీకరించింది. ఈ సినిమాను లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమాస్ సంయుక్తంగా పాన్-ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, శృతి హాసన్, పవన్ సాదినేని కలయికలో వస్తున్న ఈ చిత్రం కలలు కనే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన కథ అని మేకర్స్ నమ్ముతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్