AP: పార్టీ కార్యకర్తలకు వైసీపీని ప్రజల్లో ఎండగట్టాలని, వారి అరాచకాలను వివరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఎన్నికల్లో జగన్ పై వ్యతిరేకత, కూటమిపై నమ్మకం గెలుపునకు కారణమయ్యాయని, ప్రస్తుతం జగన్ పై సానుభూతి పెరిగినా, కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తినా ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూటమిని సఖ్యంగా ఉంచుతూ, జగన్ వ్యతిరేకతను తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.