AP: తిరుపతి-చిత్తూరు జిల్లాల్లో ‘నో హెల్మెట్- నో పెట్రోల్’ రూల్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బైక్ నడుపుతున్న, వెనక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ కొట్టవద్దని ఎస్పీలు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తాజాగా రామచంద్రాపురంలో హెల్మెట్ ధరించని పలువురు పోలీసులకు ఎస్ఐ భక్తవత్సలం ఫైన్ వేశారు. పెట్రోల్ కొట్టించకుండా వెనక్కి పంపారు. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందన్నారు.