పాలీగ్రాఫ్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్

17334చూసినవారు
పాలీగ్రాఫ్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్
పుణెలో యువ రియల్టర్‌ కేతన్‌(26) హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు సియా, ఆమె ప్రియుడు చేతన్ పాలీగ్రాఫ్ టెస్టుకు నిరాకరించారు. వారి అనుమతి ఉంటేనే టెస్టు చేయాలని కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. వారి నుంచి అంగీకారం రాకపోవడంతో టెస్టుకు అనుమతి ఇవ్వని కోర్టు నిందితులను 14రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది. దీంతో వారిని ఎరవాడ జైలుకు తరలించారు. అయితే కేతన్ హత్యలో చేతన్ స్నేహితుడి ప్రమేయమూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్