AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 629 పీఎం శ్రీ పాఠశాలల్లో 'సిక్ రూమ్‌లు' ఏర్పాటు చేస్తోంది. ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున, మొత్తం సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో ఈ గదులను తీర్చిదిద్దుతున్నారు. ఈ గదుల్లో ఆస్పత్రి తరహా బెడ్లు, ప్రథమ చికిత్స మందులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. స్థానిక ఏఎన్‌ఎంల సేవలను వినియోగించుకుంటూ విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందిస్తారు.