డిజిటల్ యుగంలోనూ పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు చెక్కులు వాడుతున్నారు. బేరర్ చెక్కుల విషయంలో, భద్రతా కారణాల దృష్ట్యా, మోసాలను నివారించడానికి బ్యాంకు అధికారులు తరచూ వెనుక వైపు సంతకం చేయమని అడుగుతారు. దారిలో చెక్కు పోయినా లేదా దొంగిలించబడినా, డబ్బు డ్రా చేసుకునే వ్యక్తిని గుర్తించడానికి ఈ సంతకం ఆధారం అవుతుంది. ఆర్డర్ చెక్కులకు ఇది తప్పనిసరి కాదు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తానికి గుర్తింపు ధృవీకరణ పత్రం అవసరం. సంతకం చేయని పక్షంలో, స్వయంగా డబ్బు స్వీకరిస్తున్నట్లు దరఖాస్తు జతచేయాలి. మూడవ వ్యక్తి బేరర్ చెక్కుతో నగదు తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే వెనుక సంతకం తప్పనిసరి.