ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదేళ్లుగా సైలెంటుగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఎవరో కాదు అనంతరంపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో తన అభిప్రాయాన్నివెల్లడించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాను, తన కుటుంబం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు గుర్నాథ్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. గతంలో ఆయన వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత జగన్‌తో కలిసి పని చేశారు. పదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.