బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఒక్కరోజే రూ.55,000 పతనమై రూ.3,50,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.75వేలు తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు ఊరటనివ్వగా.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనిచ్చింది. అలాగే రెండు రోజుల్లో 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.18,270, 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.16,750 తగ్గింది.