రూ.10 వేలు పెరిగిన వెండి ధర

16650చూసినవారు
రూ.10 వేలు పెరిగిన వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఇవాళ ఒక్కరోజే రూ.10,000 పెరిగి రూ.2,50,000కు చేరింది. ఇటీవల పది రోజుల క్రితం రూ.5,000 తగ్గిన వెండి ధర, నిన్న (బుధవారం) రూ.5,000, ఇవాళ (గురువారం) మరో రూ.10,000 పెరగడంతో మార్కెట్లో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్