వెండి ధరలు వినియోగదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం సిల్వర్ రేటు భారీగా పెరిగింది. కిలో వెండి పై ఏకంగా రూ.5,000 పెరిగి రూ. 2,40,000 లకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,45,750 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,33,600 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.