మెసేజింగ్ యాప్‌లకు సిమ్ బైండింగ్ గడువు పొడిగింపు!

3806చూసినవారు
మెసేజింగ్ యాప్‌లకు సిమ్ బైండింగ్ గడువు పొడిగింపు!
వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లకు సంబంధించిన సిమ్‌ బైండింగ్‌ నిబంధనల అమలు గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది. టెక్ కంపెనీల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిమ్ బైండింగ్ అంటే సిమ్ కార్డు లేకుండా యాప్‌లు పనిచేయవు. గత ఏడాది నవంబర్‌లో ఈ నిబంధనలు తీసుకురాగా, అమలుకు 90 రోజుల గడువు విధించారు. అయితే, సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు యాప్‌లు కేంద్రానికి తెలిపాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్