అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం

49చూసినవారు
అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం
AP: రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం పర్యటించింది. రాయపూడిలోని APCRDA కార్యాలయంలో అమరావతి ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ తదితర అంశాలను సింగపూర్ బృందానికి అధికారులు వివరించారు. శాఖమూరు పార్క్, ట్రంక్ ఇన్‌ఫ్రా రహదారులు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న టవర్లు, బంగ్లాలు, MLA & MLC టవర్స్‌ను  సందర్శించారు. సింగపూర్ బృందానికి APCRDA అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

సంబంధిత పోస్ట్