ప్రస్తుతం టెన్నిస్‌లో అగ్రస్థానంలో ఉన్న జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్‌ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మాంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో సిన్నర్ ప్రియురాలు, డానిష్ మోడల్ లైలా హసనోవిక్, సిన్నర్ మ్యాచ్‌కు కాకుండా అతని చిరకాల ప్రత్యర్థి అల్కరాజ్ మ్యాచ్‌కు హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్కరాజ్ తన తొలి మ్యాచ్‌లో సెబాస్టియన్ బేజ్‌ను 6-1, 6-3తో ఓడించగా, హసనోవిక్ అతడిని ఆసక్తిగా వీక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.