కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, ఎన్నికల ఫలితాల సరళిని మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. నకిలీ లేదా వలస వెళ్లిన ఓట్లను తొలగించడం ద్వారా పోలింగ్ శాతం వాస్తవంగా బయటపడి, అక్రమ ఓటింగ్ అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తక్కువ మార్జిన్‌తో గెలుపోటములు నిర్ణయమయ్యే అసెంబ్లీ స్థానాల్లో, డూప్లికేట్ ఓట్ల తొలగింపు నిర్దిష్ట పార్టీల 'క్యాప్టివ్ ఓట్ బ్యాంక్'ను దెబ్బతీసి, స్థానిక నాయకుల గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తుందని అంచనా.