AP: రాష్ట్రంలోని నెల్లూరులో SIR ప్రక్రియ గాడి తప్పిందని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ (YCP) ఆరోపించింది. నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్
టీడీపీ నేత అవతారమెత్తారని, రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించింది. మంత్రి నారాయణ కనుసన్నల్లో వ్యవహారాలు చక్కబెడుతున్నారని, టీడీపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. టెలీ కాన్ఫరెన్స్‌లో మై
టీడీపీ యాప్‌పై నందన్ పొగడ్తలు చేశారని పేర్కొంటూ ఒక వీడియోను Xలో పోస్ట్ చేసింది.