పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీలోని పత్తి, మొక్కజొన్న, అరటి రైతుల సమస్యలపై చర్చించి, వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఏపీలో వీలైనంత త్వరగా ఎస్‌ఐఆర్ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐతో ఉన్న సమస్యలు, అరటి రైతులకు కేంద్ర సాయం, మొక్కజొన్నను 25% కేంద్రం కొనుగోలు చేసి ఎంఎస్‌పీని నిలబెట్టాలని ఆయన కోరారు.