ఇటీవల APPSC ప్రకటించిన గ్రూప్ పరీక్షల ఫలితాల్లో గుంటూరుకు చెందిన ప్రియాంక, సాహితీ అనే అక్కాచెల్లెళ్లు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రియాంక గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్‌గా, సాహితీ గ్రూప్–2లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ప్రియాంకకు ఇది మూడవ ప్రయత్నం కాగా, సాహితీకి మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కింది. వీరి తండ్రి చంద్రుడు వాణిజ్యపన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పదవీ విరమణ చేయగా, తల్లి స్వర్ణలలిత ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు.