AP: లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. ఆయన్ను 4 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. ఎన్నికల అఫిడవిట్ లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టు విచారణలో మిథున్ రెడ్డి తెలిపారు. అలాగే సిట్ అధికారులు ఫోన్ గురించి ఆరా తీశారు. ఈ మేరకు మిథున్ రెడ్డి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనేక ప్రశ్నలకు మిథున్ రెడ్డి సహకరించేలేదన్న భావనలో సెట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.