ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నకిలీ మద్యం కేసును సవివరంగా దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, సభ్యులుగా అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, ఎస్పీలు కె.చక్రవర్తి, మల్లికా గార్గ్ ఉన్నారు. సిట్‌ను 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.