AP: నకిలీ మద్యం కేసులో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నకిలీ మద్యం బాటిల్‌లను కనుక్కునేందుకు ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ ను డిజైన్ చేశాం. స్కాన్ చేస్తే చాలు.. ఆ సీసా గురించి వివరాలన్నీ తెలుస్తాయి. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది. మరోచోట అమ్మేందుకు వీల్లేదు. నకిలీ మద్యం ఘటనలో ఎలాంటి రాజీ లేదు’’ అని అన్నారు.