శబరిమల అయ్యప్ప బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్‌ను విచారించిన సిట్‌

3432చూసినవారు
శబరిమల అయ్యప్ప బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్‌ను విచారించిన సిట్‌
శబరిమల ఆలయంలో బంగారం తాపడాలు మాయమైన కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రముఖ నటుడు జయరామ్‌ను సిట్‌ విచారించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఆయన నివాసంలో విచారణ జరిగినట్టు సమాచారం. 2019లో బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో చెన్నైలో నిర్వహించిన పూజల్లో జయరామ్‌ పాల్గొన్న వీడియోలు వెలుగులోకి రావడంతో సిట్‌ ప్రశ్నించిందట. ఉన్నికృష్ణన్‌తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించింనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్