మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ.. సిట్ పిటిషన్

13263చూసినవారు
మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ.. సిట్ పిటిషన్
AP: మద్యం కుంభకోణం కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చోటుచేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారించేందుకు ఎంపీ మిథున్ రెడ్డిని తమకు 5 రోజుల పాటు అప్పగించాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.