గంటల తరబడి కూర్చుంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ప్రమాదం

4865చూసినవారు
గంటల తరబడి కూర్చుంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ప్రమాదం
పని ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితంలో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నుంచి ఆఫీస్ అసిస్టెంట్స్ వరకు చాలా మంది రోజుకు 8-9 గంటలు కుర్చీకే పరిమితమవుతున్నారు. ఈ అలవాటు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. DVT అంటే కాళ్లలోని లోతైన సిరలలో రక్తం గడ్డకట్టడం. ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబోలిజం ఏర్పడి ప్రాణాపాయం కలగవచ్చు. నివారణకు, ప్రతి గంటకు లేచి 5 నిమిషాలు నడవాలి, తగినంత నీరు తాగాలి, కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చోకూడదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్