శివాజీ, లయల 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ ఓటీటీలో విడుదల

3355చూసినవారు
శివాజీ, లయల 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ ఓటీటీలో విడుదల
సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా, నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఈ టీవీ విన్ తాజాగా ప్రకటించింది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్