పిన్నీస్ మింగిన ఆరేళ్ల బాలుడు (వీడియో)

34320చూసినవారు
AP: ఆరేళ్ల బాలుడు పిన్నీస్ మింగిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అప్పాలాపురానికి చెందిన రాజశేఖర్, వాణి దంపతులకు షణ్ముఖ్(6) అనే కుమారుడు ఉన్నాడు. ఆడుకుంటూ షణ్ముఖ్ పిన్నీస్ మింగేశాడు. పిన్నీస్ జీర్ణాశయంలో చిక్కుకోవడంతో బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చాకచక్యంగా బాలుడి పొట్టలోని పిన్నీస్‌ను బయటకు తీశారు. సమయానికి వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్