AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిరాణ షాపుకు వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.