ప్రధాని నరేంద్ర
మోదీ రోజుకు 3-3.5 గంటలు మాత్రమే నిద్రపోతారని, అయినా ఉత్సాహంగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. సగటు మనిషికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తక్కువ నిద్ర వల్ల అలసట, ఏకాగ్రత లోపం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. మోదీకి యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి వల్ల తక్కువ నిద్ర సరిపోతుంది. అందరూ ఆయనను అనుకరించడం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీర అవసరాలకు తగినంత నిద్రపోవడమే అసలైన సూత్రం.