టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

69చూసినవారు
టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తామని SSC బోర్డు ప్రకటించింది. మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే, ఆ రోజు రంజాన్ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21న నిర్వహించే అవకాశం ఉందని, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్